News

మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావుకు గుండెపోటు


తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన్ను వెంటనే చెన్నైలోని పోరూరు రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామ్మోహనరావు అత్యవసరవార్డులో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆదాయపన్నుశాఖ అధికారులు రామ్మోహన్‌రావు నివాసంలో సోదాలు నిర్వహించి పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.